మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా

May 24, 2020 at 1:32 pm

బాలీవుడ్‌లో ఎటు చూసినా క‌రోనా.. క‌రోనా.. ప్ర‌స్తుతం క‌రోనా గోల ఎక్కువ‌యిపోయింది. వరుసగా బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే సింగర్ కనికా కపూర్ క‌రోనా బారిన ప‌డి త‌ర్వాత కాస్త కోల్కున్నారు. ఇక నిర్మాత కరీం మెరానీ ఆయ‌న కూతురు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఆ తర్వాత ప్ర‌ముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో సహాయకులుగా ఉన్న ముగ్గురికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో.. మే 14 నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

కాగా 74 ఏళ్ల కిరణ్ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించారు. ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైరస్ లక్షణాలు లేకపోయినా నాకు కరోనా పాజిటివ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జ్వరం, దగ్గు కూడా లేదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అందుకే హోం క్వారంటైన్ అయ్యాను. కోవిడ్ నిర్థారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు మాత్రం కనిపించ లేదు. మే 26న నాకు రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు.

మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా
0 votes, 0.00 avg. rating (0% score)