ఇకపై వాట్సాప్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

May 27, 2020 at 10:00 am

వాట్సాప్‌.. నేటి త‌రంలో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని యాప్‌. మెసేజ్ చేసుకోవడానికి, ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసుకునేందుకు, వీడియో కాల్ చేసుకోవ‌డానికి ఇలా ఎన్నో అవ‌స‌రాల‌కు వాట్సాప్‌ను కోట్ల‌లో వినియోగిస్తున్నారు. వాట్సాప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ.. యూజ‌ర్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారానే వంట గ్యాస్ కూడా బుక్ చేసుకోవ‌చ్చు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. వాస్త‌వానికి వంట గ్యాస్ సిలిండర్‌ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లిగానీ, లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటాం.

అయితే ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీల్) అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా ఈజీగా సిలిండర్ బుక్ చేయొచ్చు. కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని బీపీసీల్ సంస్థ వెల్ల‌డించింది.

ఇక బీపీసీల్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చునని సూచించింది. ఇందుకు ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ 1800224344 సేవ్ చేసుకోవాలి. మొదట Hi అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత Book లేదా 1 అని మెసేజ్ చేయాలి. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.

ఇకపై వాట్సాప్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts