బ్రేకింగ్: అక్కడ మరో పుల్వామా అటాక్ ప్లాన్ చేసిన ఉగ్రవాదులు…!

May 28, 2020 at 10:50 am

దేశంలో కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా సరే ఉగ్రవాదులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పాకిస్తాన్ అండ దండలతో ఉగ్రవాదులు భారత్ లో విధ్వంశం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో వందల మంది ఉగ్రవాదులను గాలిస్తూ చంపేస్తూ, అదుపులోకి తీసుకుంటున్నా ఉగ్రవాదులు మాత్రం కాల్పులకు దిగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా భారీ కుట్రకు ఉగ్రవాదులు తెరలేపారు.

 

పుల్వామాలో మరోసారి భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పేలుడుకి పాల్పడాలి అని ప్రయత్నం చేసారు. దీనితో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసారు. వాహనంలో ఐఈడీ పేలుడు పదార్ధాలను భద్రతా బలగాలు గుర్తించాయి. హిజ్బుల్ ఉగ్రవాద సంస్తు చెందిన ఒక ఉగ్రవాది కాల్పులకు దిగాడు. వెంటనే అతన్ని గుర్తించి బలగాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కుట్రను భగ్నం చేసారు.

 

ప్రస్తుతం అతనిని అదుపులోకి తీసుకుని అధికారులు కారుని స్వాధీనం చేసుకున్నారు. ఇక బలగాలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసాయి. ఆ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అని గాలింపు చర్యలను బలగాలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనితో నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. కాగా ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో గత నెలలో దాదాపు 30 మంది ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి.

బ్రేకింగ్: అక్కడ మరో పుల్వామా అటాక్ ప్లాన్ చేసిన ఉగ్రవాదులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts