షాకింగ్‌…హైద‌రాబాద్‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి…క‌రోనా ఏ స్థాయిలో ఉందంటే?

May 26, 2020 at 9:13 pm

క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత క‌ట్ట‌డి చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికీ రోజు రోజుకి వైర‌స్ అంత‌లా ప్ర‌భ‌లుతుంది. అయితే ఇది భార‌త్‌లో అధిక స్థాయిలో వైర‌స్ విజృంభ‌ణ జ‌రుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులో తెలంగాణ‌లో అయితే మ‌రీ ఎక్కువ‌గా ఈ వైర‌స్ ప్ర‌భావం క‌న‌ప‌డుతుంది. కేవ‌లం మంగ‌ళ‌వారం ఒక్క‌రోజులోనే క‌రోనా పాజిటివ్ కేసులు 71గా రాష్ట్ర వూద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేసింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,991కు చేరింది. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మంగళవారం ఓ వ్యక్తి వైర‌స్ బారిన ప‌డి చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 57కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1,284 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 120 మంది ఈ వైర‌స్ నుంచి న‌యం అయి హాస్ప‌ట‌ల్ నుంచి డిస్‌చార్జి అయ్యారు.

ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తంలో యాక్టివ్ కేసులు 650 కాగా. ఈరోజు నమోదైన కేసుల్లో 38 జీహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి జిల్లా పరిధిలో 7, మేడ్చల్ లో 6 కరోనా కేసులను గుర్తించారు. 12 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్లు స‌మాచారం. అంతేకాక, మరో నలుగురు విదేశీయులకు కూడా కరోనా సోకినట్లుగా గుర్తించారు.

షాకింగ్‌…హైద‌రాబాద్‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి…క‌రోనా ఏ స్థాయిలో ఉందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)