ఛార్మీ పెళ్లి ఆగిపోయిందా… ఏం జ‌రిగింది…?

May 28, 2020 at 7:06 am

టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోయిన్ చార్మీకి ఇప్ప‌టికే మూడున్నర ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చేసింది. ఈ ముదురు ముద్దుగుమ్మ ఇప్ప‌ట‌కీ పెళ్లి గిళ్లీ లేక‌పోయినా.. ఇటు సినిమాలు చేమ‌క‌పోయినా మాత్రం ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటూ వ‌స్తోంది. పూరి జ‌గ‌న్నాథ్‌తో ఆమె సాన్నిహిత్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పూరి – చార్మీ బంధం గ‌త నాలుగైదేళ్లుగా మ‌రింత స్ట్రాంగ్ అవుతున్న‌ట్టు గుస‌గుసలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే చార్మీ పూరి సినిమాల‌కు స‌హ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు వీళ్లిద్ద‌రు క‌లిసి అంతా ఓపెన్‌గానే చేస్తున్నారు.

తాజాగా చార్మీ గురించి మ‌రో గాసిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వంగా చూస్తే చార్మీ సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు కంటే ఆమె సినిమాలు మానేశాకే ఆమె గురించి ఎక్కువ గాసిప్‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.. వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంద‌ని.. అయితే కొంద‌రు వ్య‌క్తులు ఆమె ఇప్ప‌ట్లో పెళ్లి వ‌ద్ద‌ని ఆపార‌న్న‌దే తాజా గాసిప్ సారాంశం. ఇప్పుడు దీని గురించి పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. చార్మీ పంజాబీ అన్న విష‌యం తెలిసిందే. ఆమె అమృత్ స‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంద‌ట‌.

ఇటు త‌ల్లిదండ్రుల నుంచి కూడా ఆమెపై ఒత్తిడి ఉండ‌డంతో ఆమెకు ఇష్టం ఉన్నా లేక‌పోయినా పెళ్లికి రెడీ అవుతోన్న వేళ‌.. చివ‌ర‌కు కొంద‌రు స‌న్నిహితులు ఇప్పుడు లాక్‌డౌన్ వేళ పెళ్లి వ‌ద్దు… ఈ క‌రోనా హ‌డావిడి త‌గ్గుముఖం ప‌ట్టాక చాలా గ్రాండ్‌గానే పెళ్లి చేసుకోవాల‌ని బ‌ల‌వంతం చేశార‌ట‌. దీంతో చార్మీ త‌న పెళ్లిని కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం. ఇక చార్మీని కుటుంబ స‌భ్యులు పంజాబ్ వ‌చ్చేయ‌మ‌ని చెప్పినా ఆమె మ‌న‌సంతా హైద‌రాబాద్‌పైనే ఉంద‌ట‌.

చార్మీ మాత్రం తాను హైద‌రాబాద్‌లోనే సెటిల్ అవుతాన‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. ఇక టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్ట‌ర్‌తో ఆమె వ్య‌వ‌హారాలు.. ఆయ‌న‌తో క‌లిసి చేసే వ్యాపారాలు ఇక్క‌డ బ‌హిరంగ ర‌హ‌స్య‌మే అన్న టాక్ తెలిసిందే..?

ఛార్మీ పెళ్లి ఆగిపోయిందా… ఏం జ‌రిగింది…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts