అమెరికాకు భారత్ దగ్గర కావడానికి చైనా చూడలేక రెచ్చగోడుతుందా…?

May 27, 2020 at 12:59 pm

ఒకపక్క వాళ్ళ దేశంలో కరోనా ఇంకా కట్టడి కాలేదు. కట్టడి అయిందని ప్రపంచానికి ఆబద్దలు చెప్తూ కాలం నేట్టుకోస్తుంది. జనాలు ఇంకా బయటకు రావాలి అంటే చాలా వరకు అవస్థలు పడుతున్నారు. అయినా సరే చైనా కుక్క బుద్ధి మాత్రం మారడం లేదు. భారత్ ఒక పక్కన కరోనా తో ఇబ్బంది పడుతుంటే సరిహద్దుల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది. దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ భారత్ ని పదే పదే టార్గెట్ చేస్తుంది చైనా. తాజాగా చైనా భారత్ సరిహద్దుల్లో యుద్దానికి చూస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ తో యుద్దానికి చైనా ఆర్మీ సిద్దంగా ఉండాలని సూచనలు కూడా చేసాడు.

లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ, డెమ్‌చోక్‌, దౌలత్‌బెగ్‌ ఓల్దీ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం పెద్ద ఎత్తున చైనా సైన్యం మొహరించి భారత్ ని టార్గెట్ చేసింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో చైనా హెలికాప్టర్లు తిరిగాయి. దీనిపై భారత్ అసహనం వ్యక్తం కూడా చేసింది. దాదాపు 20 రోజుల నుంచి తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణమే ఉంది. భారత్ కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో భారత్ లోకి సైన్యాన్ని పంపిస్తుంది. ఈ పరిస్థితులపై భారత ప్రభుత్వం జాగ్రత్తలు పడుతుంది.

చైనాను కంట్రోల్ చేయడానికి మన దేశం సిద్దమైంది. భారత సైన్య, నౌకాదళ, వాయుసేన అధిపతులతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమై చర్చించి… ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద కసరత్తులు చేసారు. చైనా ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ద ట్యాంక్ లను కూడా మొహరించి యుద్దానికి సిద్దమైంది. భారత్ కూడా యుద్ద విమానాలను తరలిస్తుంది. అయితే అమెరికాకు దగ్గర కావడం తట్టుకోలేక భారత్ మీద చైనా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతుందని అంతర్జాతీయ మీడియా కూడా కామెంట్ లు చేస్తుంది.

అమెరికాకు భారత్ దగ్గర కావడానికి చైనా చూడలేక రెచ్చగోడుతుందా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts