తేనెటీగల దాడి… చిరు, చెర్రీ లకు తృటిలో తప్పిన ప్రమాదం..!!

May 31, 2020 at 2:18 pm

మెగా కోడ‌లు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు బుధవారం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వ‌య‌స్సు పైబ‌డ‌డం వ‌ల‌న ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్ట తెలుస్తుంది. ఇక‌ ఈ మేరకు మెగా కోడలు ఉపాస‌న సోషల్ మీడియాలో త‌న అభిమానుల‌తో కూడా పంచుకుంది. అయితే ఈ ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

గడికోట లక్ష్మీబాగ్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.

అయితే తేనెటీగల దాడిలో అంత్యక్రియల్లో పాల్గొన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ‌కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి. కాగా, ఉమాపతి రావు తెలంగాణలోని దోమకొండలో జన్మించారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు.

తేనెటీగల దాడి… చిరు, చెర్రీ లకు తృటిలో తప్పిన ప్రమాదం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts