ఎన్టీఆర్‌తో నాటి జ్ఞాప‌కాన్ని పంచుకున్న చిరు.. వైర‌ల్ ఫోటో..!!

May 28, 2020 at 10:13 am

నంద‌మూరి తార‌క రామారావు.. ఈ పేరుకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా అయినా రాజకీయమైనా ఎన్టీఆర్ పేరు సువర్ణాక్షరాలతో చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇక‌ వెండితెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా, ఏడుకొండల వాడైనా అంద‌రికీ ఎన్టీఆరే గుర్తుకు వ‌స్తారు. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు నందమూరి తారక రామారావు. అప్పట్లో ఎన్టీఆర్ అన్న పేరు కనబడితే చాలు సినిమాలకి ఎడ్లబండ్లు కట్టుకుని మరీ వెళ్ళారు.

రాజకీయాల్లో ఆయన చైతన్య రథం వెనకాల పరుగెత్తుకుంటూ వచ్చిన వారెందరో. తన నోట ఒక్క మాటొస్తే చాలు ఆ మాటకి గొంతు కలిపిన వాళ్లెందరో.. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారకరామావుగారి 97వ జయంతి నేడు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను చిరు అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..” అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ‘యవ్వనం… ఒక నందనం’ అంటూ సాగా పాటలో కూడా కలిసి ఆడారు.

ఎన్టీఆర్‌తో నాటి జ్ఞాప‌కాన్ని పంచుకున్న చిరు.. వైర‌ల్ ఫోటో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts