జగన్ కు ఫోన్ చేసి మ‌రి చిరంజీవి కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా..?

May 24, 2020 at 3:52 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలను అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. అంత‌లా ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ భ‌య‌పెడుతోంది. అగ్ర‌రాజ్యాలు సైతం క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నాయి. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని రీతిలో అందరినీ చావు దెబ్బ తీస్తోంది. కరోనా ఎఫెక్ట్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కరోనా వైరస్‌ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా భారీగా పడింది.

ప్రాంతీయ సినిమాలు మొదలు హాలీవుడ్ వరకు ఈ కరోనా చాలా ప్రభావాన్నే చూపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్‌ పడటం, సినిమాలు విడుదల అవ్వకపోవడంతో ఆర్థికంగా సినీ పరిశ్రమ దెబ్బతింది. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోవడంతో పాటు వేలాది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ మెగా స్టార్‌ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేశారని చిరంజీవి వెల్లడించారు.

అందుకే సీఎం జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ సమస్యలపై చర్చిద్దామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్లడించారు. అలాగే త్వరలోనే టాలీవుడ్ లోని అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో వెళ్లి ఏపీ సీఎంను కలుస్తామని తెలిపారు చిరు.

జగన్ కు ఫోన్ చేసి మ‌రి చిరంజీవి కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts