ఇక నుంచి ఏపీలో విలేజ్ క్లీనిక్ లు: జగన్ అదిరిపోయే హామీ

May 29, 2020 at 2:51 pm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ కీలకమైన ఆరోగ్య శ్రీ పథకం పై కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని వైద్యం కోసం పేద వాడు అప్పుల పాలు కావొద్దు అనే ఉద్దేశం తో ఆ నాడు వైఎస్ తీసుకొచ్చారని సిఎం అన్నారు. దానిని గత ప్రభుత్వాలు నీరు గార్చాయి అని ఆరోపించారు.

తాము పేదలకు అండగా ఉంటామని అందరికి ఆరోగ్య వర్తింపజేసే విధంగా చర్యలు చేపడతామని జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీ కార్యక్రమం కోటి 42 లక్షల మందికి అందిస్తామని అన్నారు ఆయన. ఆరోగ్య శ్రీలో రెండు వేల వ్యాధులు ఉంటాయని అన్నారు. క్యాన్సర్ కి కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరికి అందిస్తామని చెప్పారు.

2400 కోట్లతో విలేజ్ క్లీనిక్ లు తీసుకొస్తామని విలేజ్ క్లీనిక్ ల ద్వారా 24 గంటలు కూడా వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని విలేజ్ క్లీనిక్ ల నుంచి మందులు కూడా అందిస్తామని చెప్పారు. అలాగే వైద్యులు సూచించిన మందులను డోర్ డెలివరి ద్వారా అందించే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. డోర్ డెలివరి అనేది భవిష్యత్తులో అందరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తామని చెప్పారు.

నాడు నేడు ద్వారా ఆస్పత్రుల రూపు రేఖలు మార్చామని అన్నారు సిఎం జగన్. ప్రజలు ఎవరు వైద్యం కోసం ఇబ్బంది పడవద్దు అని చెప్పారు. ఏడాది కాలంలో ఎన్ని మార్పులు వైద్య రంగంలో నాడు నేడు ద్వారా తీసుకొచ్చామని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా మెడికల్ కళాశాల ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని అన్నారు. కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు ఉంటాయి అని చెప్పారు.

ఇక నుంచి ఏపీలో విలేజ్ క్లీనిక్ లు: జగన్ అదిరిపోయే హామీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts