ఒక్కడి నుంచి 80 మందికి కరోనా…! ఏపీలో ఆ జిల్లా షేక్…!

May 28, 2020 at 9:28 am

తూర్పు గోదావరి జిల్లాను ఒక గ్రామం వణికిస్తుంది. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఏకంగా 80 మందికి కరోనా రావడంతో గ్రామం మొత్తం కూడా షేక్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాలలో ఒక వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషయం తెలియని కొందరు అతని మీద పడి రోదించారు.

దీనితో అతని నుంచి 80 మందికి కరోనా వచ్చింది. ఒక వ్యక్తి నుంచి రాష్ట్రంలో ఇంత మందికి కరోనా రావడం ఇదే తొలిసారి. బుధవారం నాటికి జిల్లాలో 160 కేసులు నమోదు అయ్యాయి. సగం కేసులు ఆ వ్యక్తి నుంచే వచ్చాయి. ఈ నెల 21న జి.మామిడాడలో 53 ఏళ్ల వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత పరీక్షల్లో కరోనా వచ్చింది అని గుర్తించారు.

ఇక అక్కడి నుంచి అతని ద్వారా దాదాపు పది గ్రామాల్లో కరోనా వైరల్ విస్తరించింది. పెదపూడి, బిక్కవోలు, రామచంద్రపురం, మండపేట, అనపర్తి మండలాల్లో 80 మందికి అతని నుంచే వచ్చింది. దీనితో ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు బయటకు రావడం లేదు. దాదాపు అందరూ కూడా హోం క్వారంటైన్ లోనే ఉండి ఇంట్లోనే సామాజిక దూరం భౌతిక దూరం పాటిస్తూ తమ వంతుగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్కడి నుంచి 80 మందికి కరోనా…! ఏపీలో ఆ జిల్లా షేక్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts