బ్రేకింగ్: దేశంలో కరోనా ఆల్ టైం రికార్డ్

May 29, 2020 at 9:19 am

లాక్ డౌన్ ఉన్నా సరే కరోనా ఆగడం లేదు. ప్రజలు బయటకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏ మార్పు కూడా కనపడటం లేదు. వందల కేసులు వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దేశంలో గత వారం రోజుల నుంచి కూడా వరుసగా ఆరు వేల కేసులు నమోదు కాగా నిన్నటి నుంచి కూడా ఆ సంఖ్య ఏడు వేలకు చేరింది. ఏడు వేల కేసులు నిన్న నేడు కూడా నమోదు కావడం భయపెడుతుంది.

 

విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో వచ్చిన వారి నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 7,466 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు. 24 గంటల్లో 175 మంది కరోనాతో మరణించారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 165799 గా ఉందని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ…

 

వీటిలో 89987 క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల నుంచి 71105 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4706 మంది కరోనా కారణంగా మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో కలిపి దాదాపు 200 కేసులు నమోదు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా సంఖ్య రెండు వేలు దాటగా ఏపీలో మూడు వేలకు దగ్గరగా ఉంది.

బ్రేకింగ్: దేశంలో కరోనా ఆల్ టైం రికార్డ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts