బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు, టోటల్ నెంబర్ ఇదే…!

May 27, 2020 at 11:16 am

ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి రోజుల వ్యవధిలో వందల కేసులు నమోదు అవుతూ ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కట్టడి అవుతాయని భావిస్తున్నా ఒక రోజు తగ్గుతూ మరో రోజు భారీగా పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో తాజాగా మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

నేడు కూడా దాదాపుగా 70 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2787 కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా కేసులు 68 నమోదు కాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 816 ఉన్నాయని ఏపీ సర్కార్ పేర్కొంది. నేడు పది మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని హెల్త్ బులిటెన్ లో వివరించింది.

ఇక కోయంబేడు లింకులు 9 ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 1913 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. ఉభయగోదావరి జిల్లాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక కోయంబేడు లింకులు ఈ రెండు జిల్లాలతో పాటుగా చిత్తూరు నెల్లూరు జిల్లాలను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అర్ధమవుతుంది. దీనితో ఆ లింకులను గుర్తించే పనిలో సర్కార్ ఉంది.

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు, టోటల్ నెంబర్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts