ఏపీలో కరోనా కేసుల తాజా అప్ డేట్స్ …!

May 26, 2020 at 11:22 am

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. ఒక రోజు తగ్గడం మరో రోజు పెరగడం ఇలా ఉంటుంది గాని కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. రోజుల వ్యవధిలో వందల కేసులు నమోదు అవుతున్నాయి గాని తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. నేడు కూడా 40 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో గత 24 గంటల్లో 48 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2719గా ఉంది. నేడు నమోదు అయిన కొత్త కేసుల్లో చెన్నై కోయంబేడు మార్కెట్ లింక్ లు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 759 ఉన్నాయి. రాష్ట్రంలో 55 మంది గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరణాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు, చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నేడు కూడా ఆరు వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. లక్షా 50 వేల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉన్నా లాక్ డౌన్ సడలింపులలో భాగంగా బస్సులను అనుమతించారు కాబట్టి కేసులు పెరుగుతాయని అంటున్నారు.

ఏపీలో కరోనా కేసుల తాజా అప్ డేట్స్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts