దేశాన్ని మూసేయండి…? పలువురి హెచ్చరిక…!

May 26, 2020 at 10:48 am

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతూ కలవరపెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి ప్రతీ రోజు కూడా దాదాపు ఆరు వేల కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు నిన్న దాదాపు 7 వేల కేసులు నమోదు కాగా నేడు 6500 పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారీగా కేసులు బయటపడ్డాయి. 6535 కేసులు నమోదు అయ్యాయి.

దీనితో కేసుల సంఖ్య 145380కి చేరింది. 24 గంటల్లో కరోనా తో 146 మంది చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4167కి చేరింది. ఇప్పుడు ఇది పక్కన పెడితే రాబోయే రెండు వారాలు కూడా దేశాన్ని లాక్ డౌన్ చేయడం చాలా మంచిది అనే సలహాలు వినపడుతున్నాయి. దేశంలో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయే విధంగా చర్యలు చేపట్టి… దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేయడం మినహా పరిష్కారం లేదని ఇప్పుడు అనవసరంగా రిస్క్ వద్దని పలువురు సూచనలు చేస్తున్నారు.

దేశంలో ఏ మాత్రం కూడాపరిస్థితి బాగా లేదని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య రాబోయే రెండు మూడు వారాల్లో దారుణంగా ఉండే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీ లో కేసులు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని కాబట్టి ఒకటికి వంద సార్లు ఆలోచన చెయ్యాలని, మోడీ వెంటనే కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి రవాణాను పూర్తిగా ఆపేయడం మంచిది అని అంటున్నారు. దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశాన్ని మూసేయండి…? పలువురి హెచ్చరిక…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts