బ్రేకింగ్: దేశంలో కరోనా కొత్త రికార్డ్… టోటల్ నెంబర్ ఇదే…!

May 28, 2020 at 9:14 am

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కావడం లేదు. ప్రతీ రోజు కూడా వందల వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు వేల కేసులు ఈ విధంగా నమోదు కావడం చూసి ప్రజల్లో కంగారు మొదలయింది. నిన్న ఒక్క రోజే కరోనా కేసులు మరోసారి ఆరు వేలకు పైగా నమోదు అయ్యాయి. దేశంలో ఏడు రోజుల నుంచి ఆరు వేల కేసులు నమోదు అయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు లక్షా 58 వేలకు చేరుకుంటే… ఇప్పటి వరకు 4,531 మంది కరోనా కారణం గా మరణించారు. నిన్న ఒక్క రోజే ఆరు వేల 656 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రికార్డ్ స్థాయిలో 194 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య చూస్తే 67692 గా ఉంది. మొత్తం యాక్టివ్ కేసులు 86110 ఉన్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా వలస కార్మికుల నుంచి కరోనా ఎక్కువగా సోకుతుంది. రోజు రోజుకి వారిలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా వరకు దారుణంగానే ఉంది అని అంటున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే ప్రజలు కరోనా వైరస్ ని లైట్ తీసుకోవడం తోనే కేసులు వేగంగా పెరుగుతున్నాయని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

బ్రేకింగ్: దేశంలో కరోనా కొత్త రికార్డ్… టోటల్ నెంబర్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts