వీర్యంలోనూ తిష్టవేస్తున్న కరోనా.. బ‌య‌టప‌డ్డ షాకింగ్ విష‌యాలు..!!

May 25, 2020 at 8:44 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం దాల్చుతున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త‌ర‌కం ప్రాణాంత‌క‌ర వైర‌స్.. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రినీ గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఇక మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతున్న క‌రోనాకు.. అడ్డుక‌ట్ట వేయ‌డంతో ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయినప్ప‌టికీ క‌రోనా వైర‌స్ అదుపులోకి రావ‌డం లేదు. రోజురోజుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతుంది. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే క‌రోనా గురించి భ‌యంక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక తాజాగా కరోనా వైరస్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెల్లడైంది. ఈ వైరస్ పురుషుల వీర్యంలోనూ తిష్ట వేస్తున్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని షాంఘ్‌క్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 కరోనా రోగుల వీర్యాన్ని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.

కేంద్ర నాడీవ్యవస్థలోని ‘ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్’గా అభివర్ణించే వృషణాలు, కళ్లు, పిండం భాగాల్లోకి చేరిన వైరస్ శరీర రక్షణ వ్యవస్థ దాడి నుంచి తట్టుకుని జీవించగలదని పేర్కొన్నారు. మ‌రో విష‌యం ఏంటంటే.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మూడేళ్ల వరకు కూడా ఆయా భాగాల్లో వైరస్ జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, లైంగిక చర్య ద్వారా వైరస్ అక్కడి నుంచి భాగస్వామికి చేరే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఈ విష‌యం ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.

వీర్యంలోనూ తిష్టవేస్తున్న కరోనా.. బ‌య‌టప‌డ్డ షాకింగ్ విష‌యాలు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts