బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్….??

May 25, 2020 at 10:57 am

బిగ్‌బాస్ రియాలిటీ షో.. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టెలివిజ‌న్ రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న ఈ షో.. తెలుగు, త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డం, మ‌ల‌యాళం.. ఇలా అన్ని భాష‌ల్లోనూ స‌త్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రియాలిటీ షోలలో తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా మంచి క్రేజ్ పెంచుకున్న ప్రోగ్రాం బిగ్‌బాస్. ఇప్ప‌టికే తెలుగులో మూడు సీజ‌న్లు పూర్తి చేసుకోగా.. నాలుగో సీజ‌న్ ప్రారంభించ‌డానికి క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది.

ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో అనుకోని విధంగా.. ప్ర‌పంచ‌పై క‌రోనా దాడి చేయ‌డం.. ఆ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌ను అడ్డుకునేందుకు దేశ‌మంత‌టా లాక్‌డౌన్ విధించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో జ‌న‌జీవితం స్తంభించిపోయింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. అన్ని సంస్థ‌లు మూత్త‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డడ‌మేగాక‌.. సినిమా థియేట‌ర్లు కూడా క్లోజ్ అయ్యాయి. అయితే ఈ క‌రోనా దెబ్బ బిగ్‌బాస్ షోపై కూడా ప‌డింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ షో ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ షోలో కొందరు కలిసి ఒకే చోట కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. పైగా వంద రోజులు ఒకే ఇంట్లో ఉండాలి. దానికి తోడు బిగ్‌బాస్‌ ఇచ్చే కొన్ని టాస్క్‌ల్లో భౌతిక దూరం పాటించడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షోను ఆపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క తెలుగు భాషలోనే కాదు అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌పై ఈ ఏడాది నిషేధం విధించే అవకాశం ఉందంటున్నారు. ఇదే జ‌రిగితే.. బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌ప్ప‌దు.

బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్….??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts