ఏపీలో కొత్త‌గా మ‌రో 47 క‌రోనా‌ కేసులు.. ఒక‌రు మృతి..!!

May 23, 2020 at 1:01 pm

క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్ట‌కుని పాలిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఆగ్రరాజ్యులు సైతం త‌ల‌వంచాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌ను మ‌ట్టుపెట్టేందుకు దేశ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజుకు దాని విశ్వ‌రూపం చూపిస్తుందే త‌ప్పా.. ప్ర‌జ‌ల‌పై కాస్తైన జాలి చూప‌డం లేదు. ఇక ఏపీలో రోజురోజుకు క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.

గత 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా మరో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటెన్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 2,561కు చేరుకుంది. అదే స‌మయంలో క‌రోనా కాటుకు ఒక‌రు బ‌లైపోయారు. కృష్ణాజిల్లాలో క‌రోనా సోకి ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 56కి చేరింది.

ఇక నిన్న ఒక్క రోజులో 47 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌రకు క‌రోనా నుంచి కోలుకుని 1,778 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే మ‌రోవైపు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్న‌ట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటెన్‌ ప్రకటించింది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటడుతున్నాయి. అయితే తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కొత్త‌గా మ‌రో 47 క‌రోనా‌ కేసులు.. ఒక‌రు మృతి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts