ఏపీలో కొత్త‌గా మ‌రో 44 క‌రోనా కేసులు.. తాజా లెక్క‌లు ఇవే..!!

May 25, 2020 at 12:20 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఇది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మ‌రియు ఎంద‌రినో హాస్ప‌ట‌ల్ బారిన ప‌డేలా చేసింది. ఇక ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి.

గత 24 గంటల్లో 10,240 శాంపిళ్లను పరీక్షించగా మరో 44 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటెన్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2671కి చేరింది. ఇదే స‌మ‌యంలో క‌రోనా నుంచి కోలుకుని 41 మంది డిశ్చార్జి అయినట్లు తాజా బులెటెన్‌ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల్లో 1848 మంది డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 56కి చేరింది.

గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.

ఏపీలో కొత్త‌గా మ‌రో 44 క‌రోనా కేసులు.. తాజా లెక్క‌లు ఇవే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts