ఏపీలో క‌రోనా పంజా.. కొత్త‌గా మ‌రో 70 పాజిటివ్ కేసులు..!!

May 30, 2020 at 3:07 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా ఈ మ‌మ‌హ్మారి భ‌య‌మే ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. మ‌రోవైపు క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ క‌రోనా బీభ‌త్సం త‌గ్గ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. ఏపీలోనూ క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 9,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. అదే స‌మ‌యంలో ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే గడచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు.

ఇక తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.

ఏపీలో క‌రోనా పంజా.. కొత్త‌గా మ‌రో 70 పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts