భార‌త్‌లో క‌రోనా పంజా.. ఒక రోజులోనే 8,380 కొత్త కేసులు..!!

May 31, 2020 at 12:01 pm

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఈ పేరు వింటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రపంచ దేశాలు క‌రోనా భూతంతో విలవిల్లాడుతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం పెద్ద స‌వాల్‌గా మారింది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు విశ్వ‌రూపం దాల్చుతోంది. వాస్త‌వానికి దేశ‌వ్యాప్తంగా మొద‌ట అదుపులో ఉన్న క‌రోనా.. ప్ర‌స్తుత లెక్క‌ల బ‌ట్టీ చూస్తుంటే ప‌రిస్థితి చేయిదాటిన‌ట్టే క‌నిపిస్తోంది.

గ‌త కొన్ని రోజులుగా 6,500పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడమే ఇందుకు కార‌ణం. అయితే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నిన్ని ఒక్క‌రోజులోనే భారీగా పెరిగిపోయింది. గ‌త 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా మరో 8,380 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,82,143 కి చేరింది. అదే స‌మ‌యంలో క‌రోనా సోకి 193 మ‌ర‌ణించ‌గా.. దేశంలో ఇప్పటి వరకూ 5,164 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి  86,984 మంది కోలుకోగా.. మరో 89,995 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అంటే మనం రష్యాను దాటేసే పరిస్థితి కనిపిస్తోంది. అదే నిజమైతే… ప్రపంచంలో బ్రెజిల్, అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా ఇండియా నిలవడం ఖాయం. కాగా, మహారాష్ట్రలో మహమ్మారి డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44 శాతం ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఇక మ‌రోవైపు లాక్‌డౌన్ 5లో మరిన్ని మినహాయింపులు ఇవ్వడం, దేశవ్యాప్తంగా రవాణా, ప్రయాణాలు పెరగడం వంటి అంశాలు మున్ముందు కరోనా మరింత విస్తరించడం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి

భార‌త్‌లో క‌రోనా పంజా.. ఒక రోజులోనే 8,380 కొత్త కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts