భార‌త్‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఒక రోజులోనే 6,535 కొత్త కేసులు

May 26, 2020 at 9:43 am

ప్ర‌పంచ‌దేశాల‌ను ప్ర‌స్తుతం ప‌ట్టిపీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య క‌రోనా వైర‌స్‌. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అనాతి కాలంలోనే దేశ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. ఇంకెంత మంది ఈ మ‌హ‌మ్మారికి ఆక‌లికి బ‌ల‌వుతారో అర్థంకాని ప‌రిస్థితి. మ‌రోవైపు కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనాను నివారించాల‌ని ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు త‌గ్గ‌డం లేదు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లోనూ క‌రోనా కేస‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,535 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య‌ 1,45,380కి చేరుకుంది. ఇదే స‌మ‌యంలో 146 మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,167కి చేరుకుంది. అయితే ప్ర‌స్తుతం 80,722 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాగే ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 60,490కు చేరింది. ఇక ప్ర‌స్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరిన సంగతి తెలిసిందే. కాగా, మహారాష్ట్రలో రోజు రోజుకూ కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50వేలు దాటేసి… 52,667 కి చేరింది. నెక్ట్స్ తమిళనాడు, ఆ త‌ర్వాత‌ గుజరాత్‌లో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి.

భార‌త్‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఒక రోజులోనే 6,535 కొత్త కేసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts