మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

May 25, 2020 at 3:53 pm

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా దేశంమొత్తం లాక్‌డౌన్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు టిక్‌టాక్ వీడియోల‌తో అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు వార్నర్‌. అది కూడా తెలుగు సినిమా పాటలకు డాన్సులేస్తూ ఫిదా చేస్తుండ‌డం విశేషం.

ముఖ్యంగా ఇటీవ‌ల అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంటపురములో’ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో అనంతరం అదే సినిమాలోని ‘రాములో రాములా’ పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక‌ తాజాగా వార్నర్‌ చేసిన మరో టిక్‌టాక్‌ వీడియో అభిమానుల్ని తెగ అలరిస్తోంది.

వార్నర్ తాజాగా.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని `బాబు నువ్వు చెప్పు వాడిని కొట్టమను డప్పు` అంటూ మైండ్ బ్లాంక్ సాంగ్‌కు టిక్‌టాక్ వీడియో చేశాడు. ఈ వీడియోలో బ్యాటింగ్ చేస్తున్నట్టే చేస్తూ.. మాయమైపోతాడు. ఇక ఈ వీడియోను వార్న‌ర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే’ అంటూ పేర్కొని బై బై అని ట్వీట్ చేశాడు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ‌రి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts