భార్య‌తో `మైండ్ బ్లాక్` చేసిన డేవిడ్ వార్న‌ర్.. వైర‌ల్ వీడియో..!!

May 30, 2020 at 1:05 pm

క‌రోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానుల‌ను ఏ రేంజ్‌లో అల‌రిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ సాంగ్స్‌పై సతీమణి క్యాండిస్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటున్నా వార్నర్. ఇప్పటికే బుట్టబొమ్మ, పోకిరి డైలాగ్, బాహుబలి సాంగ్‌కు భార్య, కుమార్తెతో కలిసి చేసిన వీడియోలతో వార్నర్‌కు ఫాలోవర్స్ బాగా పెరిగారు.

ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్‌టాక్ చేయమని వార్నర్‌ను అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్‌కు టిక్‌టాక్‌ చేసిన వార్నర్‌, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్‌1ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌కు టిక్‌టాక్‌ అని చెప్పకుండా సర్‌ప్రైజ్‌ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్‌ ఇచ్చాడు వార్నర్‌.

దీంతో వార్నర్‌ తర్వాత టిక్‌టాక్‌ ‘మైండ్‌ బ్లాక్‌’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక‌ చెప్పినట్లే మైండ్‌ బ్లాక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు వార్న‌ర్‌. అయితే ఇది పార్ట్‌ -1 అని చెప్పాడు. ఇందులో త‌న భార్య‌తో క‌లిసి వార్న‌ర్ చేసిన డ్యాన్స్‌.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. 50 టేకుల త‌ర్వాత ఇది సాధ్య‌మైంది అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యాన్స్‌ని వార్న‌ర్ డ్యాన్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

భార్య‌తో `మైండ్ బ్లాక్` చేసిన డేవిడ్ వార్న‌ర్.. వైర‌ల్ వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts