మళ్లీ ఆయనకే ఓటేసిన పవన్

May 2, 2020 at 9:07 am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రీఎంట్రీ సినిమాగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత పవన్ 28వ చిత్రాన్ని గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ 29వ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇద్దరు డైరెక్టర్లను లైన్‌లో పెట్టాడు పవన్. గతంలో గోపాల గోపాల, కాటమరాయుడు వంటి చిత్రాలను అందించిన డాలీ ఈ సినిమా కోసం కథను రెడీ చేస్తున్నాడట.

అటు పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్ తెరకెక్కించిన మరో దర్శకుడు బాబీ కూడా ఈ సినిమా కోసం కథను రెడీ చేస్తున్నాడట. అయితే పవన్ బాబీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడని, ఆయన చెప్పిన స్టోరీలైన్ పవన్‌కు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు కుదిరితే బాబీ డైరెక్షన్‌లో పవన్ 29వ చిత్రం రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మళ్లీ ఆయనకే ఓటేసిన పవన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts