వీడెంత నీచుడంటే… క‌న్న‌త‌ల్లి శ‌వాన్ని కూడా ఇంట్లోకి రానివ్వ‌లేదు కార‌ణం ఏంటో తెలిస్తే షాకే?

May 26, 2020 at 10:37 am

ఈ రోజుల్లో డ‌బ్బులు, ఆస్తికి ఉన్న విలువ‌లు బంధాలు అనుబంధాల‌కు ఉండడం లేదు. క‌న్న‌త‌ల్లి అయినా క‌న్న‌కొడుకైనా ఎవ్వ‌రైనా స‌రే డ‌బ్బు, ఆస్తి త‌ర్వాతే అన్న‌ట్లు ఉంటున్నారు. డ‌బ్బు త‌ప్ప‌ప్రేమ అభిమానాలు ఇలాంటివేమి లేకుండా పోతున్నాయి. డ‌బ్బు త‌ప్ప‌ మ‌రో ప్ర‌పంచం ఉండ‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ అంత నీచంగా త‌యార‌వుతుంది. క‌న్న‌త‌ల్లిని సైతం లెక్క‌చేయ‌ని ఘ‌ట‌న‌లు అనేకం. గుంటూరు లో ఇలాంటి విచార‌క‌ర‌ణ ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది.

గుంటూరుజిల్లాలో సత్యనారాయణ, ధనలక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మ‌ద్యానికి బానిసైన కొడుకు ఆస్తి కోసం త‌ల్లిదండ్రుల‌ను ఇబ్బందిపెడుతూ ఉండేవాడు. ఆస్తి తన పేరు మీద రాయాలని వారిపై ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని రెండేళ్ల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తర్వాత కొద్దిరోజులు ఆ గొడవ సద్ధుమణిగింది.

జనవరిలో అనారోగ్యం కార‌ణంగా మ‌లేశ్వ‌రావు తండ్రి మ‌ర‌ణించాడు. అయితే ఆ క‌ఠినాత్ముడికి తండ్రి చనిపోయాడనే బాధ కూడా లేకుండా ఆస్తి కోసం పంచాయితీ పెట్టాడు. బతికున్న సమయంలో తండ్రిని సరిగా చూసుకోలేదని.. అలాంటి వ్యక్తికి ఆస్తి ఎందుకని అతడి సోదరి ప్రశ్నించింది. ఆస్తి విషయంలో నెమ్మ‌దిగా గొడవలు చెలరేగాయి. బంధువులు అందరికి సర్థిచెప్పి పంపించడంతో వివాదం మళ్లీ ముగిసింది. ఆస్తి కోసం త‌న క‌న్న‌త‌ల్లి అడ్డుగా ఉంద‌ని భావించి రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చిన మల్లేశ్వరరావు తల్లిని ఇంట్లోనే ఉంచి తలుపులు వేసి నిర్బంధించాడు. పొలం, ఇల్లు తన పేరుతో రాయకపోతే చంపేస్తానని బెదిరించాడు.

కొడుకు వేధింపులు భరించలేని ఆమె వెనుక తలుపు ద్వారా తప్పించుకుని పారిపోయింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకుపై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కొడుకు దగ్గరకు వెళ్లకుండా బాపట్లలో ఉంటున్న కూతురి వద్ద ఉంటోంది. ధనలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంత‌రం చనిపోయింది. ఇక కూతురు ఒక‌త్తే ఒంట‌రి అయిపోయింది. అల్లుడు లాక్‌డౌన్ కార‌ణంగా వేరే ఊరిలో ఉండిపోయాడు. దీంతో తల్లి మృతదేహంతో మంగళగిరిలోని ఇంటికి వెళ్లింది. అక్కడ కొడుకు తల్లి శవాన్ని ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరించలేదు. బంధువులు, స్థానికులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో పోలీసులు అత‌డ్ని అరెస్ట్ చేసి పోలీసులు అత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

వీడెంత నీచుడంటే… క‌న్న‌త‌ల్లి శ‌వాన్ని కూడా ఇంట్లోకి రానివ్వ‌లేదు కార‌ణం ఏంటో తెలిస్తే షాకే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts