మూఢ‌న‌మ్మ‌కాలు పేరుతో వీడెంత‌దారుణానికి ఒడిగ‌ట్టాడంటే?

May 18, 2020 at 4:34 pm

టెక్నాల‌జీ ఎంత పెరిగినా కూడా ఇప్ప‌టికీ ఇంకా చాలా మందిర క్షుద్ర‌పూజ‌ల‌ను, మూఢ‌న‌మ్మ‌కాల‌ను న‌మ్ముతుంటారు. దాని వ‌ల్ల ఒక్కోసారి ఎలాంటి దారుణ‌మైన మోసాలు జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ‌యిపోయాయి. ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో కూడా అర్ధంకాని ప‌రిస్థితులు ఉన్నాయి. అలాంట‌ప్పుడూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అయినా కూడా ఇప్ప‌టికి కొంద‌రు ఇలాంటివి న‌మ్మి మోస‌పోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి గుంటూరులో చోటు చేసుకుంది.

లాక్ డౌన్ వేళ గుప్త నిధుల పేరుతో యువకుడు అభంశుభం ఎరుగ‌ని ఓ బాలిక పై పలుమార్లు దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన విష్ణువర్ధన్ రోగాలు నయం చేసేందుకు తాయెత్తులు కడుతుంటాడు. ఇటీవ‌లె దొనకొండ మండలంలోని రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో విష్ణువర్ధన్‌కు పరిచయమైంది. ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి తాయెత్తులు కట్టేందుకు రావాలంటూ విష్ణువర్ధన్‌ను రామాంజనేయులు ఆహ్వానించాడు. గ్రామానికి వచ్చిన విష్ణువర్ధన్‌కు ఓ ఇంటిలో ఉండేందుకు బస ఏర్పాటు చేశారు.

బస చేసిన ఇంటి యజమాని కుమార్తె పైనే కన్నేశాడు ఆ దుర్మార్గుడు విష్ణువర్ధన్. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని య‌జ‌మాని న‌మ్మేట‌ట్లు చేశాడు. బాలికతో పూజలు చేయిస్తే వాటిని వెలికి తీయొచ్చని చెప్పాడు. దీంతో వారు నిజమేనని నమ్మి ఇంటి యజమాని పూజలకు ఏర్పాటు చేశాడు. గదిలోకి వెళ్లిన తర్వాత పూజల పేరుతో బాలిక పై విష్ణువర్ధన్ పలుమార్లు దారుణానికి పాల్పడ్డాడు. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్థులు అతడిని గ‌ట్టిగా నిలదీయడంతో బాలిక పై అత్యాచార విషయం వెలుగు చూసింది. దీంతో ఆ ఇంటియ‌మాని ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యాడు. నిందితుడికి దేహశుద్ది చేసిన అనంతరం గ్రామస్తులు అతడిని పోలీసులుకు అప్పగించారు.

మూఢ‌న‌మ్మ‌కాలు పేరుతో వీడెంత‌దారుణానికి ఒడిగ‌ట్టాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts