కొత్త వివాదానికి తెర లేపిన హ‌రీష్ శంక‌ర్‌

May 12, 2020 at 10:27 am

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌కు పెద్ద అభిమాన సంఘం ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న మొద‌టి చిత్రం నుంచే ఆయ‌న‌కు ఒక రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ తమ్ముడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారాయ‌న‌. ఇక ఆయ‌న న‌టించిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌` చిత్రం విడుద‌లై స‌రిగ్గా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో ఆయ‌న అభిమానులంతా కూడా ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలుపుతూ శుభాకాంక్ష‌ల‌తో ఫుల్‌గా ట్విట్ట‌ర్ మొత్తం నిండిపోయింది. ఇక ఈ సంద‌ర్భంగా చిత్ర‌ర ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ అభిమానులంద‌రికీ కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదే విధంగా ఆయ‌నకు ఈ చిత్రంతో త‌న‌కున్న కొన్ని మ‌ధురానుభూతుల‌ను ఓ లెట‌ర్ ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఇంత‌వ‌ర‌కు అంతా బాగానే ఉంది. మ‌రి అస‌లు చిక్కంతా ఇక్క‌డే వ‌చ్చింది. అదేంటి అనుకుంటున్నారా..అవునండీ ఈ లెట‌ర్‌లో చిత్ర నిర్మాత అయిన బండ్ల గ‌ణేష్ పేరు లేక పోవ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దీని పై చ‌ర్చ సాగుతోంది. అందులోనూ బండ్ల గ‌ణేష్‌కి ప‌వ‌న్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏకంగా ఆయ‌న ఆరాధ్య దైవంగా భావిస్తాడు బండ్ల‌గ‌ణేష్ అలాగే ఆయ‌న ఏదైనా ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌లో కూడా ప‌వ‌న్ గురించి మాట్లాడితే క‌నుక ఇక ఆ స్పీచ్చే సెప‌రేట్ అని చెప్పాలి. అలాగే అభిమానులందరూ సోషల్ మీడియాలో ‘గబ్బర్‌సింగ్’ ట్యాగ్‌‌తో రికార్డులు కొడుతుంటే.. ఇక బండ్ల గణేష్ ఆనందానికి మాత్రం అవధులే లేవ‌ని చెప్పాలి. అలాగే బండ్ల గ‌ణేష్ కూడా గబ్బర్‌సింగ్‌తో త‌న జ్ఞాప‌కాల‌ను ఒక‌సారి గుర్తు చేసుకున్నారు. ఇక తాజాగా హరీష్ విడుదల చేసిన లెటర్‌లో బండ్ల గణేష్ పేరు లేకపోవడమే కాదు దాంతో పాటు ఆచిత్రంలో న‌టించిన హీరోయిన్ శృతిహాస‌న్ పేరు కూడా లేదు. దీంతో అభిమానులంతా కూడా వీరిద్ద‌రి మ‌ధ్య ఏమ‌న్నా గొడ‌వ‌లున్నాయా అన్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అందుకోసం బండ్ల గ‌ణేష్ పేరు ప్ర‌స్తావించ‌లేదేమో అన్న కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/harish2you/status/1259881793097891844/photo/1

కొత్త వివాదానికి తెర లేపిన హ‌రీష్ శంక‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts