ప్రభుత్వం దివాళా తీసిందా…?; ఏపీ సర్కార్ కి హైకోర్ట్ ప్రశ్న…!

May 26, 2020 at 4:02 pm

బిల్డ్ ఏపీ మిషన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేడు దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు. భూముల అమ్మకాలపై ప్రభుత్వం దివాళా తీసిందా అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

బిల్డ్ ఏపీ పథకాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టగా వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్య చేసారు. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి ఆక్షన్ జరపాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను మే 28వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. గుంటూరుకు చెందిన సురేశ్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ లో విచారణ జరిగింది.

ప్రభుత్వం దివాళా తీసిందా…?; ఏపీ సర్కార్ కి హైకోర్ట్ ప్రశ్న…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts