ఏపీలో మాడు పగిలే ఎండలు.. మరో 6 రోజులు బ‌య‌ట‌కు రావొద్దంటూ హెచ్చ‌రిక‌

May 24, 2020 at 7:48 am

ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా ఎండ‌లు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించ‌డంతో.. పనులు లేక ఇళ్లకే పరిమితమైన పేదప్రజలు జానెడు పొట్ట నింపుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో ఎండ‌లు ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌య‌పెడుతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.

అయితే తాజాగా ఆంధ్రావాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మరో ఆరు రోజుల పాటు బయటికి రావద్దని సూచించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సూర్యుడు భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ నెల 28 వరకు ఇదే రకంగా ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 29 నుంచి మాత్రం పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో పలు చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. ఇక ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చ‌రించింది. అలాగే నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.

ఏపీలో మాడు పగిలే ఎండలు.. మరో 6 రోజులు బ‌య‌ట‌కు రావొద్దంటూ హెచ్చ‌రిక‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts