దేశంలో నిమిషానికి ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయంటే…!

May 27, 2020 at 9:36 am

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ముందు పదుల సంఖ్యలో కేసులు ఆ తర్వాత లాక్ డౌన్ ఆ తర్వాత వందల కేసులు మరోసారి లాక్ డౌన్ పెంపు ఆ తర్వాత మూడు వేలు లాక్ డౌన్ ని కొనసాగించారు. ఇప్పుడు ఆరు వేల కేసులు ప్రతీ రోజు కూడా వేల కేసులు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి.

 

కరోనా కట్టడిలో చర్యలు తీసుకున్నా సరే ఫలితం కనపడటం లేదు. ఇక నిమిషా నిమిషానికి కరోనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. దేశంలో యావరేజ్ ని ప్రతీ రోజు కూడా ఆరు వేల కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి.. 24 గంటల్లో యావరేజ్ న చూస్తే… 1440 నిమిషాలకు చూస్తే… నిమిషానికి 4.1 కేసులు బయటపడుతున్నాయి. అంటే ప్రతీ పావు నిమిషానికి ఒక కేసు దేశంలో నమోదు అవుతూనే ఉంది.

 

అదే విధంగా 24 గంటల్లో చూస్తే ప్రతీ గంట కు 250 కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. నేడు కూడా ఆరు వేల కేసులు వచ్చాయి. దీనితో లక్ష్నన్నర దాటింది కరోనా కేసుల సంఖ్య. ఇప్పుడు కట్టడి కాకపోతే మాత్రం భవిష్యత్తులో వర్షా కాలం వస్తే మాత్రం కట్టడి కావడం అనేది చాలా కష్టం అనే అభిప్రాయం దేశ వ్యాప్తంగా వినపడుతుంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్నీ చెప్తుంది.

దేశంలో నిమిషానికి ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts