అనుమానంతో భార్య‌ను క‌త్తితో న‌రికి చంపి చివ‌రికి?

May 10, 2020 at 5:29 pm

అనుమానం పెను భూతం అంటే ఇదేనేమో. మ‌న‌సారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పై అనుమానం పెంచుకున్నాడు ఆ కిరాత‌కుడు. మంచిర్యాల జిల్లాలోని ఆర్కేపీకి చెందిన పుల్లూరి సురేష్‌, సంధ్యారాణిని కొన్నాళ్ల పాటు ప్రేమించికుని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత తాగుడుకు బానిసైన సురేష్‌ వరకట్నం కావాలంటూ సంధ్యారాణిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె 2013లో భర్త పై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్ట‌డం జ‌రిగింది.

దీంతో పోలీసులు సురేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దాంతో భార్యను కొన్నాళ్ల పాటు బాగానే చూసుకున్న అతడిలో మ‌ళ్ళీ స‌డెన్‌గా అనుమానం మొదలైంది. భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడినా అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించడం మొద‌లు పెట్టాడు. మానసికంగా, శరీరకంగా వేధింపుల‌కు గురి చేశాడు. దీంతో వాటిని స‌హించ‌లేక‌ ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెద్దలు రాజీ కుదర్చడంతో ఇద్దరూ మళ్లీ కాపురం మొదలుపెట్టారు.

తిరిగి మరోసారి గొడవ జరగడంతో సురేశ భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య ప్రియుడిని కలిసేందుకే పుట్టింటికి వెళ్లిందని అనుమానపడిన సురేశ్ ఈ నెల 7వ తారీఖున అక్కడికి వెళ్లాడు. సంధ్యారాణితో గొడవపడి మ‌రీ వెంట తెచ్చుకున్నాడు. పోనీ ఆమెతో స‌వ్యంగా కాపురం చెయ్య‌కుండా కత్తితో మొహం, ఛాతీ, వీపు భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచి అక్క‌డి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో సంధ్యారాణి అక్కడికక్కడే చనిపోయింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

అనుమానంతో భార్య‌ను క‌త్తితో న‌రికి చంపి చివ‌రికి?
0 votes, 0.00 avg. rating (0% score)