భార్య పై అనుమానంతో భ‌ర్త ఎంత ప‌ని చేశాడంటే?

May 26, 2020 at 9:57 pm

అనుమానం పెనుభూతం అంటారు. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు త‌ప్పించి అనుమానాలు కాదు. ఒక‌వేళ అలాంటిదేమ‌న్నా మ‌న జీవితంలో ఒక్క‌సారి వ‌చ్చిందంటే చాలు ఇక జీవితాంతం న‌ర‌క‌మే కనిపిస్తుంది. అనుమానం అనే మాయ‌రోగంతో సుఖ‌మైన జీవితాన్ని న‌రకం చేసుకుంటున్నారు కొంత మంది దంప‌తులు. భ‌ర్త భార్య పైన అనుమానంతో ఎంత ప‌ని చెయ్య‌డానికైనా వెన‌కాడ‌డం లేదు. ఒక్కోసారి ప్రాణాలు తియ్య‌డానికి కూడా ఏమాత్రం వెన‌కాడ‌డం లేదని చెప్పాలి.

హైద‌రాబాద్‌లో ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది. భ‌ర్త స‌తీష్ గోల్డ్ స్మిత్ ప‌ని చేస్తున్నాడు. భార్య నిజాం పేట్ హిల్ కౌంటీలో హౌస్ కీపింగ్ చేస్తుంది. కొద్ది కాలంగా భార్య పై అనుమానంతో భ‌ర్త భార్య‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నాడు. వీరిద్ద‌రికి వివాహం జ‌రిగి 16 ఏళ్ళు అయింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. బ‌తుకు దెరువు కోసం ప‌దేళ్ల కింద‌టే న‌గ‌రానికి వ‌చ్చి నివాస‌ముంటున్నారు. భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని అనుమానంతో పెద్ద దారుణానికి ఒడిగ‌ట్టాడు.

భ‌ర్త మద్యం తాగొచ్చి వేధిస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాత్రి మద్యం మత్తులో బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న జయలక్ష్మి తలపై బండరాయితో బలంగా మోదాడు. దీంతో భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసున్నారు.

భార్య పై అనుమానంతో భ‌ర్త ఎంత ప‌ని చేశాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)