హైదరాబాద్ మటన్ వ్యాపారి ఇంట్లో క‌రోనా క‌ల‌కలం…ఎంత‌‌మందికి వ‌చ్చిందంటే?

May 26, 2020 at 8:44 pm

మూడు నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టి పీడిస్తుంది. ఇక ఈ వైర‌స్‌ని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో ఈ వైర‌స్ త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుంది. హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మటన్ వ్యాపారి ఇంట్లో కుటుంబసభ్యులంద‌రూ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. ఒకే కుటుంబంలో మొత్తం 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టుగా సమాచారం. పహాడీషరీఫ్‌లో నివాసం ఉండే ఓ మటన్ వ్యాపారి ఇంట్లోని 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు ఆ షాప్‌లో మటన్ కొన్న వాళ్లంతా ఇప్పుడు ఆందోళనకు గుర‌వుతున్నారు. వారంతా కూడా ప్ర‌స్తుతం క్వారంటైన్ పాటిస్తున్నారు.

ప్రస్తుతం పహాడి షరీఫ్ ప్రాంతం మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ కింద తీసుకున్నారు అధికారులు. అయితే ఈ వ్యాపారికిజియాగూడలోని బంధువుల ద్వారా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో జియాగూడ ఏరియా కూడా మొత్తం వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కుల్సుంపురా ‌ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్, వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్, సంజయ్‌నగర్ ఈ బస్తీల్లో కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరించింది. ఇక ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడ నలుమూలలా కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ మటన్ వ్యాపారి ఇంట్లో క‌రోనా క‌ల‌కలం…ఎంత‌‌మందికి వ‌చ్చిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)