ఆరోగ్య సేతు యాప్ లో బగ్స్ కనిపెడితే.. ఎంత ఇస్తారంటే…!

May 27, 2020 at 10:17 am

దేశంలో కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ చాలా కీలకంగా మారింది. ఆర్టీసి డ్రైవర్ల నుంచి కేంద్ర మంత్రులు విదేశాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో దీని భద్రత పై కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ యాప్ లో మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి కేంద్రం బహుమతి ప్రకటించింది.

 

కనిపెట్టిన వారికి ఒక్కో బగ్ కి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇస్తామని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల చేసారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి కూడా మరో లక్ష రూపాయలు ఇస్తామని ఆమె వివరించారు.

 

అదే విధంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్‌ ప్లాట్‌ఫాంగా తయారు చేసామని ఆమె వివరించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్‌ జారీ చేస్తే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా పాస్‌ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని ఆమె సూచించారు.

ఆరోగ్య సేతు యాప్ లో బగ్స్ కనిపెడితే.. ఎంత ఇస్తారంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts