భార‌త్‌లో క‌రోనా కల్లోలం ..ఒక్కరోజులో ఎన్ని కేసులంటే !

May 26, 2020 at 10:00 am

క‌రోనా వైర‌స్ కోర‌లు చాచిన వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైర‌స్ విజృంభ‌ణ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకి వైర‌స్ కేసుల సంఖ్య అంత వేగంగా పెరుగుతోందంటే…గత 24 గంటల్లో దేశంలో 6535 కొత్త కేసులు నమోదు కాగా.. 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఒక్క‌సారిగా 1.45 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ మనదేశంలో 4167 మంది కోవిడ్ వల్ల మరణించారు. దేశంలో ప్రస్తుతం 80 వేేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు 42.6 శాతానికి చేరింది.

అయితే మ‌న ద‌గ్గ‌ర వైర‌స్ ముందు నుంచి కూడా కాస్త ఎక్కువగానే ఉన్న‌ప్ప‌టికీ టెస్టులు చేయ‌డంలో కాస్త అశ్ర‌ద్ధ వ‌హించ‌డం వ‌ల్ల అంత‌గా కేసులు బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇక ఇదిలా ఉంటే… ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 55.86 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా.. 3.47 లక్షల మంది ప్రాణాల‌ను కోల్పోయారు.

ఇక మన దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా మ‌రో 2436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంతా కోవిడ్ బాధితులతో కిట‌కిట‌లాడుతుంద‌ని చెప్పాలి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1186 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 60 మంది చనిపోయారు. పాజిటివ్ కేసులు సంఖ్య 52,667కు చేరింది. ముంబై నగరంలోనే కొత్తగా 1430 కేసులు నమోదు కాగా.. దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది.

భార‌త్‌లో క‌రోనా కల్లోలం ..ఒక్కరోజులో ఎన్ని కేసులంటే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts