హాట్ టాపిక్‌గా మారిన త్రిష పోస్ట్‌.. రానా గురించేనా..?

May 27, 2020 at 4:02 pm

హీరోయిన్ త్రిష‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `నీమనసు నాకు తెలుసు` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటి.. ప్రభాస్ హీరోగా వచ్చిన `వర్షం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఇక ప్ర‌స్తుతం సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ.. కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలను దక్కించుకొంటున్నది. అయితే రానా పెళ్లి వార్త తర్వాత త్రిష మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఎందుకంటే.. రానా, త్రిషల మధ్య బంధం సినిమాలకు అతీతమైనది. వారిద్దరి చెన్నైలో బాల్య స్నేహితులు. అయితే వారి మధ్య స్నేహం పరిధి దాటి ప్రేమగా మారిడం, వారిద్దరి మధ్య అఫైర్ చాలా కాలం సాగింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అంతేకాదు రానా, త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సెన్సేషనల్‌గా మారాయి. ఇప్పుడు మిహీకాను తాను పెళ్లి చేసుకోనున్నట్లు రానా ప్రకటించిన నేపథ్యంలో తాజాగా హీరోయిన్ త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగిస్తారో వారు అహంకారులని ఓ పరిశోధనలో తేలిందంటూ వచ్చిన వార్తను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు ముందే తెలుసని ఆమె కామెంట్ చేసింది. అయితే త్రిష చేసిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె రానా గురించే ఈ కామెంట్ చేసిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో త్రిష తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. అప్పటికే కొందరు ఆమె చేసిన వ్యాఖ్యను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మ‌రీ వైర‌ల్ చేస్తున్నారు. కాగా, గ‌తంలో రానా త్రిషతో డేటింగ్ విషయాన్ని పలు సందర్భాల్లో ఒప్పుకొన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. త్రిషాతో రిలేషన్ నిజమే. మా మధ్య కొంతకాలం డేటింగ్ నడించిన మాట వాస్తవమే. ఆ తర్వాత అఫైర్‌కు పుల్‌స్టాప్ పెట్టి ఫ్రెండ్స్‌గానే ఉండాలని అనుకొన్నాం అని రానా చెప్పారు.

హాట్ టాపిక్‌గా మారిన త్రిష పోస్ట్‌.. రానా గురించేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts