13 ఏళ్ళ బీహార్ బాలికకు ఇవాంకా ఫిదా…!

May 23, 2020 at 11:37 am

ఆ 13 ఏళ్ళ పాప చేసిన సాహసం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. 1200 కిలోమీటర్లు తండ్రిని ఎక్కించుకుని సైకిల్ తొక్కడం అనేది సాధారణ విషయం కాదు.అది కూడా ఎండలో… ఆ పాప చేసిన సాహసం గురించి రాయడానికి అంతర్జాతీయ మీడియా కూడా ఎంతో ఆసక్తి చూపించింది. ఏ పాప కూడా తన తండ్రి కోసం చేయని సాహసం చేసింది. ఎక్కడ హర్యానాలోని గుర్గావ్…

 

ఎక్కడ బీహార్ లోని దర్బంగా… ఇప్పుడు ఆ బాలిక చేసిన సాహసం చూసి అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా ఫిదా అయిపోయారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలని ఆమె ఒక ట్వీట్ చేసారు. భారతీయ ప్రజలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయనేది ఈమె ద్వారా తనకు తెలిసిందని ఆమె చెప్పారు.

 

ఇది కేవలం తనను మాత్రమే కాకుండా సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను ఆకర్షించిందని ఆమె పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే మే 10న గురుగ్రామ్‌ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం మే 16న తన సొంత ఊరు దర్బంగాకు చేరుకుంది. తండ్రికి హర్యానా లో రిక్షాల అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో తండ్రిని తీసుకుని ఆమె సొంత ఊరు వచ్చింది. దీనితో గ్రామస్తులు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు.

13 ఏళ్ళ బీహార్ బాలికకు ఇవాంకా ఫిదా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts