లాక్‌డౌన్ వేళ గ‌ప్‌చుప్‌గా ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ మ‌హేష్‌..!!

May 14, 2020 at 3:51 pm

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఎంతో మంది న‌టుల్లో మ‌హేష్ కూడా ఒక‌డు. అయితే లాక్‌డౌన్ వేళ గుప్‌చుప్‌గా ఈ మోస్ట్ పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌హేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ హీరో నిఖిల్, డాక్టరు పల్లవిల వివాహం ఇవాళ ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజే ‘జబర్దస్త్’ నటుడు మహేశ్ వివాహం కూడా జరిగింది. నటుడిగా దూసుకెళ్తున్న మహేష్ వివాహం పావనితో జరిగింది.

Jabardasth Mahesh Marriage రంగస్థలం నటుడు మహేష్ ...

మే 14వ తేదీన ఉదయం. 6.31 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. తన సమీప బంధువు అయిన అమ్మాయినే మహేశ్ వివాహం చేసుకున్నట్టు సమాచారం. ఇక లాక్‌డౌన్ కారణంగా గుట్టుచప్పుడు కాకుండా హంగులు, ఆర్బాటాలకు దూరంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు మ‌హేష్‌. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌ వివాహా వేడుకకు అతికొద్ది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.

Jabardasth Mahesh Marriage Exclusive Video | NTV Entertainment ...

 

ప్ర‌స్తుతం వీరిపెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా మహేశ్ దంపతులకు వారి బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు. కాగా, జబర్దస్త్ కామెడీ షో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన మ‌హేష్‌.. వెండితెర‌పై కూడా స‌త్తా చాటాడు. సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత రంగస్థలం చిత్రంతో మనోడి దశ మారిపోయి.. వెండితెర‌పై బాగానే రాణిస్తున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న నేటి బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు.

లాక్‌డౌన్ వేళ గ‌ప్‌చుప్‌గా ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ మ‌హేష్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts