ప్రత్యేక హోదా పై జగన్ తాజా వ్యాఖ్యలు…!

May 28, 2020 at 2:41 pm

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మన పాలన మీ సూచన పేరుతో పారిశ్రామిక రంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఇవ్వలేదు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా ప్రత్యేక హోదా సాధించే విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వలేదన్న ఆయన… హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవని జగన్ అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందని ఆరోపించారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెజార్టీ రాకపోయింటే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమన్న ఆయన… ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

 

భవిష్యత్‌లో ఇతర పార్టీలపై కేంద్రంలో ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని జగన్ అనడం గమనార్హం. దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీ అని కాబట్టి కచ్చితంగా మన అవసరం కేంద్రానికి ఉంటుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అప్పుడు కచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినవి అన్నీ కూడా సాధిస్తామని జగన్ పేర్కొన్నారు. ఎపీలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉందని జగన్ పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా పై జగన్ తాజా వ్యాఖ్యలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts