బ్రేకింగ్:పోతిరెడ్డి పాడుపై జగన్ ఏమన్నారంటే…!

May 26, 2020 at 2:03 pm

ఏడాది పరిపాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ వ్యవసాయ శాఖపై మేధోమధనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు పలు హామీలు ఇచ్చారు జగన్. నాలుగేళ్ల‌కు బ‌దులుగా ఐదేళ్ల పాటు రైతు భ‌రోసా ఇస్తామని అన్నారు జగన్. ఈ ఖ‌రీఫ‌ల్లో రైతుల‌కు 9 గంట‌ల ప‌గ‌టి పూట క‌రెంటు ఇస్తామన్న ఆయన… ఉచిత కరెంట్ ద్వారా ప్రతీ రైతుకి 49 వేలు ఆదా అవుతుందని జగన్ పేర్కొన్నారు. ఈ నెల 30న రైతు భ‌రోసా కేంద్రాలు ప్రారంభిస్తామని జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు.

 

పోలవరం ప్రాజెక్ట్ కరోనా కారణంగా వాయిదా పడిందని వచ్చే ఏడాది పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు విజ్ఞాన కేంద్రాలుగా మారతాయని అన్నారు. అదే విధంగా సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో అవినీతి లేకుండా చేసామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము 1095 కోట్లు ఆదా చేశామన్నారు జగన్. అలాగే కరోనా ఉన్నా సరే రైతులకు 1300 కోట్ల మేర తాము సహాయం చేసామని జగన్ గుర్తు చేసారు. మొక్కజొన్న అరటి పంటలను కొనుగోలు చేసామని అన్నారు.

 

వారం రోజుల్లో డబ్బులను కూడా చెల్లించామని చెప్పారు జగన్. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన వైఎస్ జగన్… పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచకపోతే రాయలసీమ కరువు తీరే అవకాశం లేదని ఈ విషయంలో తెలంగాణకు కూడా న్యాయం జరగాలని జగన్ వివరించారు. రెండు రాష్ట్రాలు కూడా 800 అడుగుల వద్దనే నీటిని వాడుకున్తున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అన్నారు. రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు ఆయన. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని పేర్కొన్నారు.

బ్రేకింగ్:పోతిరెడ్డి పాడుపై జగన్ ఏమన్నారంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts