వాళ్లకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్…!

May 22, 2020 at 5:45 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మద్యం రవాణా విషయంలో సిఎం వైఎస్ జగన్ చాలా వరకు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎవరిని కూడా తాను ఉపేక్షించేది లేదని అధికార పార్టీ నేతలకు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరూ కూడా ఇసుక అక్రమాలకూ పాల్పడటానికి వీలు లేదని ఎవరు అయినా సరే కేసులు నమోదు చెయ్యాలని జగన్ నుంచి సష్టమైన ఆదేశాలు వెళ్ళాయి అధికారులకు. ఇక అధికారులు కూడా ఈ విషయంలో చాలా వరకు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఒక్క విషయాన్ని సేకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే రాయలసీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాలో ఇసుక వ్యాపారం చేస్తున్నారని జగన్ కి సమాచారం అందింది. దీనికి రెవెన్యు అధికారుల నుంచి, మైనింగ్ కి చెందిన అధికారుల నుంచి సహకారం ఉందని వారికి ఒక మంత్రి సహకారం అందిస్తున్నారు అని తెలిసింది. దీనితో వెంటనే అధికారులతో జగన్ నేరుగా మాట్లాడారు. సదరు వ్యక్తుల గురించి తెలుసుకున్నారు. అందరి మీద కేసులు నమోదు చేయడమే కాకుండా అధికారుల మీద విచారణ చెయ్యాలని డీజీపీ కి సూచించారు సిఎం జగన్.

ఇక ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక మంత్రి ద్వారా జగన్ కి తమ వంతుగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారని అయినా సరే జగన్ మాత్రం వారు ఇచ్చే వివరణ వినలేదు అని సమాచారం. ఇలాంటి చర్యల ద్వారా అనవసరంగా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని హైకోర్ట్ సీరియస్ గా ఉన్న సమయంలో మీ కారణంగా తాను ఇబ్బందులు పడవద్దు అని జగన్ ఆగ్రహంగా చెప్పారట. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఫైన్ కూడా కట్టాలని జగన్ నేరుగా సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడి చెప్పినట్టు తెలుస్తుంది.

వాళ్లకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts