జగన్ కోరిక ఏంటో చెప్పిన జేసీ..?

May 29, 2020 at 7:17 pm

ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు టీడీపీ నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి జగన్ పాలనపై తనదైన శైలిలో కామెంట్ లు చేసారు. ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేసారు. జగన్ ఏడాది పాలనకు వందకు 110మార్కులు వేస్తానని ఆయన తన మార్క్ వ్యాఖ్య చేసారు.

 

జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని ఆయన అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసన్న ఆయన… హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమని జేసి దివాకర్ రెడ్డి అర్ధం కాని వ్యాఖ్య చేసారు.

 

జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి కామెంట్ చేసారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అన్నారు జేసీ. టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ.సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం 2019లో తేలిందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

జగన్ కోరిక ఏంటో చెప్పిన జేసీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts