ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

May 28, 2020 at 8:50 am

నందమూరి తారక రామారావు.. ఈ పేరు వినబడగానే ప్రతీ తెలుగువాడి గుండె తెలుగుదనంతో నిండిపోతుంది. రొమ్ము విరుచుకుంటుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్ 97వ జయంతి నేడు. ఆయన స్వర్గస్తులై 24ఏళ్లవుతున్నా కూడా ఆ రూపం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో అలాగే ఉంటుంది.

ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లని కదిలిస్తుందని అంటారు. తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి ఎన్టీఆర్ పలికిన పలుకులు కోట్లమందిని కదిలించాయి. అలాంటి మహనీయుడి పుట్టినరోజుని కరోనా కారణంగా జరుపుకోలేకపోతున్నాం. కరోనా మహమ్మారి మన జీవితంలో భాగమై ఎన్నో సంతోషాలని దూరం చేసింది. ఈ సమయంలో ఎన్టీఆర్ పుట్టినరోజుని వేల మంది సమక్షంలో జరుపుకోలేక పోవచ్చు. కానీ ప్రతీ తెలుగువాడి గుండె ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటుంది.

ప్రతీ సంవత్సరం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకి చేరుకుని నివాళులు అర్పించేవారు. కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాత గురించి ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తాతపై తనకున్న ప్రేమను చాటుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. `నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.., మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది…, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత..` అని భావొద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts