హైద‌రాబాద్‌లో అన్నీ ఓపెన్‌… కెసీఆర్ ట్విస్టేంటంటే?

May 18, 2020 at 8:15 pm

క‌రోనా కోర‌లు చాచిన వేళ‌ కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించిన‌ లాక్ డౌన్ 4.0 నిబంధ‌న‌లు ఓ వైపు… దేశ‌వ్యాప్తంగా అమ‌లు అవుతున్న విష‌యం తెలిసిందే. మిగ‌తా రాష్ట్రాల‌న్నింటికంటే ముందుగా దీర్ఘ‌కాలిక లాక డౌన్ పొడ‌గింపు ద్వారా తెలంగాణ‌‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా లాక్ డౌన్ 4 విష‌యంలో మార్గ‌ద‌ర్శ‌కాలు నిర్దేశించేందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. ఆయ‌న వివిధ అంశాల‌పై స‌మ‌గ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదలపై స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడం, రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధి విధానాలపైనా చర్చించారు. ప్ర‌ధానంగా లాక్ డౌన్ విష‌యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గంలో ఆయ‌న చర్చించారు.

అనంత‌రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ‌లోని కంటైన్మెంట్ జోన్లు మిన‌హా అన్నింటినీ గ్రీన్ జోన్లుగా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కంటైన్మైంట్ జోన్ల‌లోని ప్ర‌జ‌లు సంబంధిత నిబంధ‌న‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఆయ‌న‌ స‌హ‌క‌రించాల‌ని కోరారు. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బ్ర‌తుకును కొన‌సాగించాల‌ని కోరారు. నిబంధ‌న‌లను అనుస‌రించి వ్యాపారాలు, కార్య‌క‌లాపాలు అన్నీ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. వారి వారి వ్యాపారాల‌ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ఆర్టీసీ బ‌స్సులు మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే స‌ర్వీసులు న‌డ‌వ‌నున్న‌ట్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌స్సు స‌ర్వీసులు అనుమ‌తించ‌బోవ‌డం లేద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా బ‌స్సు స‌ర్వీసుల‌ను నిర్వ‌హించ‌బోవ‌డం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. సెలూన్లూ సైతం ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని వెల్ల‌డించారు. కాగా, క‌ర్ఫ్యూ కొన‌సాగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే సెలూన్లు ఓపెన్ చేసిన‌ప్పుడు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పూర్తి శానిటైజ‌ర్ చేసి ఏదైనా ప‌ని చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

హైద‌రాబాద్‌లో అన్నీ ఓపెన్‌… కెసీఆర్ ట్విస్టేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts