మ‌ళ్లీ మ‌హాన‌టినే ఎంచుకున్న నితిన్‌..??

May 24, 2020 at 10:21 am

ఇటీవ‌ల భీష్మ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యంగ్ హీరో నితిన్ సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అదే జోరుతో ఇప్పుడు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు నితిన్‌. అయితే ఈసారి స్ట్రేట్‌ సినిమాతో కాకుండా రీమేక్‌తో అభిమానులను అలరించనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, టాబు, రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన‌ బాలీవుడ్ చిత్రం `అంధాధున్‌`. ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా న‌టించిన ఈ చిత్రం జాతీయ పుర‌స్కారాన్ని అందించి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీనే తెలుగులో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చుతున్నారట. ఇక ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే హీరోయిన్ కోసం వేట సాగించిన చిత్ర యూనిట్ నాని `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇండస్ట్రీ వర్గాల తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ సరసన మరోసారి కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. కీర్తి సురేష్ ఇప్పటకే నితిన్‌తో రంగ్ దేలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నితిన్ మ‌ళ్లీ మ‌హాన‌టినే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.. హిందీలో టబు చేసిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణ చేయనుందని తెలుస్తోంది. అంధాధున్ లో టబు పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటూ.. నెగిటివ్ అండ్ బోల్డ్‌గా ఉంటుంది. ఆ పాత్రలో టబు అదరగొట్టింది. మ‌రి అలాంటి పాత్ర‌లో రామ్య‌కృష్ణ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

మ‌ళ్లీ మ‌హాన‌టినే ఎంచుకున్న నితిన్‌..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts