నితిన్‌ను ఆ ఇద్ద‌రు హీరోయిన్లు రిజెక్ట్ చేశారా..?

May 26, 2020 at 7:49 am

యంగ్ హీరో నితిన్‌.. ఇటీవ‌ల భీష్మ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు సూప‌ర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అదే జోష్‌తో వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న `రంగ్ దే` సినిమాలో న‌టిస్తున్నారు. అంతేకాకుండా, హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాధూన్’ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు కూడా నితిన్ ప్రకటించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్ర తెలుగు రీమేక్ కు మేర్లపాక గాంధీను దర్శకుడిగా ఎంచుకున్నాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ ఫాద‌ర్ ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Keerthy Suresh opens up on her wedding rumours

అంధుడిగా నటించే వ్యక్తి తన ప్రియురాలి దగ్గర ఎందుకు దోషిగా నిలబడ్డాడు? తన ముందు జరుగుతున్న క్రైమ్స్ చూస్తూ ఆ వ్యక్తి ఎలా స్పందించాడు? క్రిమినల్స్‌ను ఎలా పట్టించాడు? అనేది కథ కాగా… హిందీలో విమర్శల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఇక‌ఇప్పుడు తెలుగులో అంధుడి పాత్రలో నితిన్ విలక్షణమైన నటనను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు గానూ కీర్తి సురేష్‌, ప్రియాంక మోహన్‌ ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Priyanka Arul Mohan in Sreekaram- The New Indian Express

అయితే అందుతున్న తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఆ ఇద్దరు నితిన్‌ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇందులో లిప్‌లాక్‌లు ఉండటమేనని టాక్‌. కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కీర్తి సురేష్‌ లిప్‌లాక్‌లకు దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. అందుకే ఈ రీమేక్‌కు మహానటి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక‌ మరోవైపు గ్యాంగ్ లీడర్ ఫేమ్‌ ప్రియాంక కూడా లిప్‌లాక్‌ విషయంలో కొన్ని కండీషన్లు పెట్టుకుందట. అందుకే ఆమె కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలా ఈ ఇద్ద‌రు హీరోయిన్లు నితిన్‌ను రిజెక్ట్ చేశార‌న్న‌మాట‌.

నితిన్‌ను ఆ ఇద్ద‌రు హీరోయిన్లు రిజెక్ట్ చేశారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts