ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఇకపై పేద‌లంద‌రికీ ఫ్రీ ఇంట‌ర్నెట్‌..!!

May 31, 2020 at 7:44 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మ‌రోవైపు ఈ క‌రోనా భూతానికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప‌లు దేశాలు దీనిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అ‌వ్వ‌డంతో పాటు.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ పేద ప్ర‌జ‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది కేర‌ళ ప్ర‌భుత్వం.

వాస్త‌వానికి అక్షరాస్యత విషయంలో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచే కేరళ రాష్ట్రం.. కరోనా కట్టడి విషయంలోనూ ముందుంది. ఇక తాజాగా కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా, తక్కిన వారికి అందుబాటు ధరలలో ఇంటర్నెట్‌ సేవలను అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ‘కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్’ (కె ఫోన్) ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.

ఇది పూర్తయితే డిసెంబరు నుంచి నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై సీఎం పినరయి విజయన్ వివరణ ఇచ్చారు. ఇంటర్నెట్ సౌకర్యం పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని భావిస్తున్నామని, మరే రాష్ట్రంలోనూ పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వడం లేదని తెలిపారు. ఇక ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు కోసం సుమారు 1,500 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేయనుండగా, ఈ సంవ‌త్స‌రం డిసెంబర్‌ కల్లా కంప్లీట్ కానుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఇకపై పేద‌లంద‌రికీ ఫ్రీ ఇంట‌ర్నెట్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts