మహేష్ సినిమా అంటే లెక్కచేయలేదట!

May 2, 2020 at 9:40 am

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తన కెరీర్‌‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను వేసుకున్న మహేష్, కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ అందించిన కథను ఓకే చేసిన మహేష్, త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసి రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. గతంలో మహేష్ సరసన నటించిన పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకుందామని అనుకున్న చిత్ర యూనిట్‌కు ఆమె నో చెప్పిందట. దీంతో భరత్ అనే నేను చిత్రంలో మహేష్‌తో జోడీ కట్టిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదించారట చిత్ర యూనిట్. కానీ ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉండటంతో మహేష్ చిత్రానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. తనకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరో అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా మహేష్ చిత్రానికి నో చెప్పిందట.

ఇలా కియారా మహేష్ చిత్రానికి నో చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. కాగా కియారా కంటే మంచి ట్యాలెంటెడ్ హీరోయిన్‌ను ఈ సినిమాలో తీసుకుని ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇలా మహేష్ బాబు సినిమాకు నో చెప్పిన హీరోయిన్ చిత్రాలను పట్టించుకోబోమని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.

మహేష్ సినిమా అంటే లెక్కచేయలేదట!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts